ట్రంప్‌ తీసుకున్న తొలి మంచి నిర్ణయం!

71487218956_625x300

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి వివక్షకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులు వారికి మాత్రమే కేటాయించిన బాత్‌రూంలు, లాకర్‌ రూమ్స్‌ ఉపయోగించుకునే విధానానికి స్వస్తి పలికారు. ఇక నుంచి అన్ని పాఠశాలల యాజమాన్యాలు మిగతా విద్యార్థులకు అవకాశం ఇచ్చినట్లుగానే ట్రాన్స్‌జెండర్‌ విద్యార్థులకు బాత్‌ రూమ్‌ల విషయంలో, లాకర్స్‌  రూమ్‌ల విషయంలో సమాన అవకాశాలు కల్పించాలని తాజాగా ప్రకటించారు.

గతంలో తమ లింగానికి చెందినవారి గదులు, లాకర్స్‌మాత్రమే ఉపయోగించుకునేందుకు ట్రాన్స్‌ జెండర్‌ విద్యార్థులకు అవకాశం ఉండేది. ఆ నిబంధనను గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల్లో తక్షణమే అమలుచేయాలని పరిపాలన వర్గం ఆదేశించింది.

‘ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా స్కూళ్లలో, వర్గాల్లో, కుటుంబాల్లో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలకు తెరపడినట్లవుతుంది. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం కనుగొన్నట్లవుతుంది. రాష్ట్ర, స్థానిక స్థాయిలో ముందుగా పరిష్కరించాల్సిన అతిముఖ్యమైన సమస్య ఇదే’ అని విద్యాశాఖ కార్యదర్శి బెట్సీ దేవోస్‌ చెప్పారు. ఈ నిర్ణయంతో ఇక విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండబోదని చెప్పారు.