ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండు ఇదే!

61486207538_625x300
గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండుగా వెలుగొందుతున్న ఆపిల్ను గూగుల్ వెనక్కి నెట్టేసింది. ఈ సారి ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండుగా టెక్ దిగ్గజం గూగుల్ టాప్లో నిలిచింది. దీని తర్వాతి స్థానంలోకి ఆపిల్ను పరిమితం చేసింది. 109 బిలియన్ డాలర్ల(రూ 7,32,534కోట్లకు పైగా) విలువతో గూగుల్  ఈ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాది దీన్ని విలువ 88 బిలియన్ డాలర్ల(రూ.5,91,404 కోట్లు)గా ఉంది. మరోవైపు ఆపిల్ బ్రాండు విలువ 2016లో 145 బిలియన్ డాలర్ల నుంచి రూ.107 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో గూగుల్ తర్వాతి స్థానంలోకి ఆపిల్ వచ్చిందని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండుల లిస్టులో టాప్ 100లో నిలుస్తున్న దేశీయ టాటా గ్రూప్ ఈ సారి కిందకి దిగజారిందని బ్రాండు ఫైనాన్స్ గ్లోబల్ 500, 2017 రిపోర్టు పేర్కొంది. గతేడాది 82 స్థానాన్ని సంపాదించుకున్న టాటా గ్రూప్, ఈ సారి 103 స్థానానికి పడిపోయినట్టు తెలిపింది. గత అక్టోబర్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న టాటా గ్రూప్లో సంక్షోభం దీనికి దెబ్బతీసిందట. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి హఠాత్తుగా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ గ్రూప్ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మిస్త్రీ-టాటాల మధ్య నెలకొన్న ఈ వివాదంతో టాటా గ్రూప్ పరువు వీధిన కూడా పడింది.  ఇతర ఇండియా బ్రాండుల్లో ఎయిర్టెల్ గతేడాది 242లో ఉండగా.. ఈ సారి 190 స్థానాన్ని సంపాదించుకుంది. ఎల్ఐసీ కూడా తన బ్రాండు విలువను 222 స్థానానికి పెంచుకుంది. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ కూడా 301 స్థానం నుంచి 251 స్థానంలోకి వచ్చినట్టు రిపోర్టు వెల్లడించింది.