అలగాల్సిన అవసరం ఏంటీ?: కిషన్ రెడ్డికి క్లాస్ పీకిన అమిత్ షా

23-1495517149-resized-bjp36

నల్గొండ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడారు. సోమవారం సమావేశంలో పిలుస్తున్నా సభా వేదికపైకి ఎందుకు రాలేదని కిషన్ రెడ్డిని షా ప్రశ్నించారు.

దళితవాడలో అమిత్ షా ఇది ఇలా ఉండగా, నల్గొండ జిల్లాలోని వెలుగుపల్లిలో మంగళవారం ఉదయం అమిత్ షా పర్యటించారు. అక్కడి దళితవాడలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని షా ఆవిష్కరించారు. దళితవాడకు దీన్ దయాళ్ ఉపాధ్యాయు కాలనీగా పేరు పెట్టారు. ఆ తర్వాత చిన్నమదారంలో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.