సెంచరీ కొట్టిన సెన్సెక్స్..స్థిరంగా నిఫ్టీ, రుపీ

ముంబై:  ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.  ఆరంభంలోను పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు వెంటనే లాభాల సెంచరీ సాధించాయి. సెన్సెక్స్155 పాయింట్ల లాభంతో 26015 వద్ద నిఫ్టీ  65  పాయింట్ల లాభంతో 8018 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ8వేల స్థాయిని ,  సెన్సెక్స్ 26 వేల స్థాయిని దాటి స్థిరంగా ట్రేడవుతోంది.  దాదాపు అన్నిరంగాలూ  గీన్ లో  ట్రేడ్ అవుతున్నాయి.ముఖ్యంగా రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్ ఆయిల్ అండ్  గ్యాస్  సెక్టార్లు  పుంజుకున్నాయి.

స్మాల్ అండ్  మిడ్ క్యాప్ షేర్లలో కొనుగోళ్ల ధోరని కనిపిస్తోంది.  అలాగే   ఇటీవల బాగా నష్టపోయిన ఐటీ  సెక్టార్ లో  మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గారు.  హిందాల్కో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లోనూ,  టాటా మోటార్స్‌, అంబుజా సిమెంట్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి. అయితే  నిఫ్టీ 7900 వద్ద గట్టి మద్దతు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం నగదు విభాగంలో రూ. 2010 కోట్ల అమ్మకాలు చేపట్టారు.

అటు  రికార్డ్ స్తాయి  కనిష్టాన్ని నమోదుచేసిన రూపాయి  కోలుకుంటోంది.  డాలర్ మారకపు విలువలో 30 పైసల  లాభంతో 68.44  వద్ద ఉంది.