రిలయన్స్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు

24brk-reliance

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చమురు శుద్ధి కర్మాగారంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులని, వారికి చికిత్స అందిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఫ్లూయిడ్‌ కాటలిటిక్‌ క్రాకింగ్‌ యూనిట్‌(ఎఫ్‌సీసీయూ)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ గాసోలిన్‌ యూనిట్‌లో రోజుకి 6.60లక్షల బారెల్స్‌(బీపీడీ)ల ఉత్పత్తి జరుగుతోందని కంపెనీ పేర్కొంది. ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పరిశ్రమకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు ఆధునిక రిఫైనరీలున్నాయి. ఇవి రెండూ కలిసి దాదాపు 1.2 మిలియన్ల బీపీడీ ముడిచమురును శుద్ధి చేస్తాయి.

డొమెస్టిక్‌ టారిఫ్‌ ఏరియా(డీటీఏ) ప్రాంతంలోని ఒక యూనిట్‌లో ప్రమాదం జరిగిందని, మిగతా యూనిట్లలో పనికి ఎటువంటి ఆటంకం కలగలేదని కంపెనీ పేర్కొంది.