తైవాన్‌లో భూకంపం

 

తైపేయ్‌: తైవాన్‌లో శుక్రవారం భూకంపంసంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. హ్వాలియాన్‌ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. ఫిబ్రవరిలో తైనన్‌ నగరంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ కూలిపోయి 117 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999 సెప్టెంబర్‌లో తైవాన్‌లో 7.6 తీవ్రతతో అతి భయంకర భూకంపం సంభవించడంతో 2,400 మంది మృత్యువాతపడ్డారు.