డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

depressed young man sitting on the bench

 

 • పోషకాహార లోపం & డిప్రెషన్

  డిప్రెషన్ మరియు మానసిక సంబంధిత రుగ్మతలు అనేది ఈ కాలంలో చాలా సాధరణ సమస్యలు. భౌతిక కార్యాలు కాకుండా, మానసిక భావోద్వేగాలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల పోషకాల లోపం వలన డిప్రెషన్ కలుగుతుంది. ఒక పోషకం కంటే ఎక్కువ పోషకాల లోపం వలన డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలలో వెల్లడించబడింది. ఇక్కడ తెలిపిన పోషకాల లోపం కారణంగా డిప్రెషన్ కలగవచ్చు. Image source: Getty Images

 • 2

  ఒమేగా-3 ఫాటీ ఆసిడ్

  ఒమేగా-3 మారియు ఒమేగా- 6 ఫాటీ ఆసిడ్ లోపం వలన డిప్రెషన్ కలుగుతుందని అధ్యయనాలలో తెలుపబడింది. మెదడు పనితీరుకు మరియు పూర్తి మానసిక ఆరోగ్యానికి ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు అవసరం. ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి నుండి ఈ పోషకాలు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రకం పోషకాహార లోపాన్ని కలిగి ఉండే వారు రోజు పాటించే ఆహార ప్రణాళికలో ఫ్లాక్స్ సీడ్స్ మరియు చేపలను చేర్చుకోండి. Image source: Getty Images

 • 3

  అమైనో ఆసిడ్ లు

  మనం తినే ఆహారంలో అమైనో ఆసిడ్ లను మెదుడు తన కీలక విధులకు అవసరమయ్యే న్యూరో ట్రాన్స్ మీటర్ గా మార్చుకుంటుంది. కావున ఇది చాలా ముఖ్యమైన పోషకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ మీ శరీరానికి తగిన స్థాయిలో అమైనో ఆసిడ్ లను పొందలేకపోతే, ఏకాగ్రతలో లోపాలు మరియు డిప్రెషన్ వంటి వాటికి లోనవ్వాల్సి వస్తుంది. మీట్, ఎగ్స్, ఫిష్, నాణ్యత గల బీన్స్, సీడ్స్ మరియు నట్స్ లలో అమైనో ఆసిడ్ లు అధికంగా ఉంటాయి.   Image source: Getty Images

 • విటమిన్ ‘B’ లోపం

  విటమిన్ ‘B’ లోపం వలన డిప్రెషన్ వంటి మానసిక భావోద్వేగ సంబంధిత లోపాలు కలుగుతాయని అధ్యయనాలలో తెలుపబడింది. కావున విటమిన్ ‘B’ అధికంగా గల మీట్, ఫిష్, పౌల్ట్రీ, ఎగ్స్ మరియు పాలు వంటి వాటిని తాగండి. Image source: Getty Images

 • 5

  ఫోలేట్

  శరీరంలో ఫోలేట్ స్థాయిలు తగ్గటం వలన యాంటీ డిప్రసేంట్ శక్తి కూడా తగ్గుతుంది కావున మనోరోగ చికిత్సా నిపుణులు (సైకియాట్రిస్ట్) ఫోలేట్ మందులను వాడమని సలహా ఇస్తుంటాడు. సరైన స్థాయిలో ఫోలేట్ ను పొందాలనుకుంటే సిట్రస్ జాతికి చెందిన పండ్లు, లేగ్యూమ్స్, బీన్స్ మరియు పచ్చని ఆకుకూరలను తినండి. Image source: Getty Images

– See more at: http://telugu.onlymyhealth.com/health-slideshow/nutritional-deficiencies-that-may-cause-depression-in-telugu-1484227864.html#sthash.C9qY4YEU.dpuf