రాగులు నానబెట్టి మొలకలొచ్చాక ఎండించి పిండి చేసి తింటే..

మన శరీరం ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కోవటానికి దృఢంగా ఉండాలి. దృఢమైన శరీరం గల వారు రోగాలను ఎదుర్కొనగలరు. శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంతో తీసుకోవాలి. వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి. మొక్కగట్టిన ధ్యానం పిండిని రాగిమాల్ట్ అంటారు. రాగుల్ని బాగు చేసి నీళ్ళలో నానబెట్టి నాలుగు గంటల తరువాత గుడ్డలో వేసి మూటగట్టి పైన బరువు ఉంచండి. రెండు మూడు రోజుల్లో చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దోరగా వేయించాలి. నూనె వెయ్యకుండా మామూలు మూకుడిలో వేయించి అలా వేగిన రాగుల్ని మర పట్టించాలి. ఆ పిండినే రాగిమాల్ట్ అంటారు. రాగి మాల్ట్ ని రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి.