రణరంగంగా కాలిఫోర్నియా వర్సిటీ

41486062693_625x300

లాస్‌ఏంజెలిస్‌: బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీలో ట్రంప్‌ మద్దతుదారుడు, వివాదాస్పద ఎడిటర్‌ మైలో ఇనాపొలస్‌ కార్యక్రమానికి నిరసనగా బుధవారం రాత్రి విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. క్యాంపస్‌ అద్దాల్ని పగులగొట్టి, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు.

విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మైలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆందోళనలపై ట్విటర్‌లో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ వాక్‌ స్వాతంత్య్రాన్ని అనుమతించకుండా హింసాత్మకంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి నిధులు ఇవ్వబోమని హెచ్చరించారు.