బంగ్లాతో టెస్టుకు భారత్‌ జట్టు ఇదే!

31brk-1team144

న్యూదిల్లీ: హైదరాబాద్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం మంగళవారం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తమిళనాడుకు చెందిన అభినవ్‌ ముకుంద్‌ ఆరేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున ముకుంద్‌ 700 పరుగులు చేశాడు. చివరిసారిగా 2011లో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన జట్టులో ముకుంద్‌ ఉన్నాడు. మరోవైపు కీపింగ్‌ బాధ్యతలు నిర్వహించడానికి పార్థీవ్‌ పటేల్‌ను వెనక్కి నెట్టి సాహా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్‌ స్టేడియంలో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. దీనికంటే ముందు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా-ఏతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకోనుంది.

భారత్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, కరణ్‌ నాయర్‌, హర్దిక్‌ పాండ్య, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభినవ్‌ ముకుంద్‌